News February 3, 2025

మంచిర్యాల: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. కాగా అతను ఆత్మహత్య చేసుకున్నాడా.. మరేదైనా కారణం వల్ల మృతి చెందాడా అనే తెలియాల్సి ఉందన్నారు. మృతుడి ఛాతిపై అమ్మ అని రాసి ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Similar News

News November 22, 2025

యాషెస్ టెస్టు.. 847 బంతుల్లోనే ముగిసింది

image

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. అటు తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు 405 బంతులే(67.3 ఓవర్లు) ఎదుర్కొన్నారు. 1904 తర్వాత ఇంత తక్కువ ఓవర్లలో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులను ముగించడం ఇదే తొలిసారి.

News November 22, 2025

‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

News November 22, 2025

తుని: రైలు నుంచి జారిపడి ఒకరు మృతి

image

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రేగుపాలెం-ఎలమంచిలి రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణించిన ట్రైన్ నుంచి జారి పడి ఇతను మరణించి ఉండవచ్చని రైల్వే పోలీసులు చెబుతున్నారు. మృతుడికి 30 ఏళ్లు ఉంటాయని, మిలిటరీ గ్రీస్ కలర్ ఫుల్ హాండ్స్ టీషర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడని చెప్పాడు.