News July 25, 2024
మంచిర్యాల: అమృత్ భారత్ పథకంలో చోటు
రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 రైల్వే స్టేషన్లు ఇందుకు ఎంపికయ్యాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, బాసర రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద పునరాభివృద్ధి చేయనున్నారు.
Similar News
News October 8, 2024
ఆదిలాబాద్: గ్రామాల్లో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్‌గా పోటీ చేయడానికి ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో పాత వారితో పాటు కొత్తగా బరిలో నిలవడానికి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 468, మంచిర్యాల 311, నిర్మల్ 396, ఆసిఫాబాద్‌లో 355 పంచాయతీలు ఉన్నాయి.
News October 7, 2024
భవిష్యత్తు కోసం అడవులను కాపాడుకుందాం:ఎఫ్ఆర్ఓ
భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
News October 7, 2024
బెజ్జూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతి
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.