News February 2, 2025
మంచిర్యాల: ఆపరేషన్ స్మైల్‌లో 88 మంది బాలలకు విముక్తి

అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-lX విజయవంతమైందని CPశ్రీనివాస్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా కమిషనరేట్ పరిధిలో 88 మంది బాలలకు విముక్తి కలిగించినట్లు తెలిపారు. CP మాట్లాడుతూ.. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ నిరంతరం నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 15, 2025
మర్రిగూడ: కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

మర్రిగూడ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం <<15462226>>సర్వేయర్ రవి<<>> లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికీ కార్యాలయంలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ధరణిలో జరిగిన అక్రమ భూరిజిస్ట్రేషన్‌లపై ఆఫీసర్లు సిబ్బంది నుంచి కూపీ లాగుతున్నారు. ఆఫీస్‌లోని రికార్డులను పరిశీలిస్తున్నారు.
News February 15, 2025
ప్రేమలో పడ్డారా? ఇలా తెలుసుకోండి!

మొబైల్‌లో చాట్ చేస్తూ నవ్వుకుంటున్నామంటే చాలు వీడు ప్రేమలో ఉన్నాడు అని మన పెద్దవాళ్లు డిసైడ్ చేసేస్తుంటారు. మీరు మీమ్స్ చూసి నవ్వుకుంటున్నారన్న విషయం వారికి తెలియదు. కానీ, ప్రేమలో పడినవారి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని BBC ఓ కథనంలో పేర్కొంది. బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటే, చేతులు జిగురులా అతుక్కుంటే.. అవి ప్రేమలో పడ్డారనడానికి సంకేతం అని పేర్కొంది.
News February 14, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

>పాలకుర్తిలో 32 కిలోల గంజాయి పట్టివేత >ఈనెల 16వ తేదీ నుండి 28 వరకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నాం: కలెక్టర్ >షమీం అత్తర్ కమిటీ పత్రాలను దగ్ధం చేసిన మాల మహానాడు నేతలు >బీఆర్ఎస్ నేతలకు వింత జబ్బు సోకింది: కడియం >ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి కలెక్టర్ > అక్రమ ఇసుక రవాణా జరగడానికి వీలు లేదు ఏసిపి > తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు > ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు 89 మంది గైర్హాజరు