News March 20, 2025

మంచిర్యాల: ఆ ఉపాధ్యాయుడే కీచకుడు

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. మంచిర్యాల గర్ల్స్ హై స్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Similar News

News November 2, 2025

భద్రాద్రి: రేపు డివిజన్ల వారీగా ప్రజావాణి

image

ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కలెక్టరేట్ ఇన్ వార్డులో కూడా తమ దరఖాస్తులు ఇవ్వొచ్చని సూచించారు.

News November 2, 2025

తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.

News November 2, 2025

అలంపూర్ ఎమ్మెల్యే ఫోన్ నంబర్ హ్యాక్

image

ఈ మ‌ధ్య కాలంలో సైబ‌ర్ నేర‌గాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రాజ‌కీయ నాయ‌కులు, బిజినెస్ మ్యాన్‌ల‌నే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. వారికి తెలియ‌కుండానే వారి మొబైల్‌ని, లేదా సిస్ట‌మ్‌ని హ్యాక్ చేస్తూ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫోన్‌ను హ్యాక్ చేశారు. త‌న మొబైల్ నుంచి వ‌చ్చే ఎలాంటి సందేశాల‌కు ఎవ్వ‌రూ కూడా రెస్పాండ్ కావ‌ద్ద‌ని ఎమ్మెల్యే సూచించారు.