News April 12, 2025
మంచిర్యాల: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News November 26, 2025
BHPL: సర్పంచ్ పదవి కోసం మొదలైన సమావేశాలు

సర్పంచ్ పదవి కోసం రాజకీయ పార్టీల్లో దరఖాస్తుల కొలహాలం ప్రారంభమైంది. జయశంకర్ జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామపంచాయతీలు ఉండగా మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుంది. మొదటి విడతలో నాలుగు మండలాలకు ఎన్నికలు జరగనుండగా.. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీల ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
News November 26, 2025
ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నామినేషన్లు మూడు విడతల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల హ్యాండ్బుక్పై పూర్తి అవగాహనతో తప్పులేని విధంగా పనులు చేయాలని సూచించారు. నగదు-మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టి చెక్పోస్టుల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు.
News November 26, 2025
ప్రీ డయాబెటీస్ని ఎలా గుర్తించాలంటే?

ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ రావడానికి ముందు స్టేజి. వీరిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినదాని కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ స్టేజిలో జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి మందులు ఇవ్వకుండా ముందు డైట్ పాటించాలని, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.


