News February 12, 2026
మంచిర్యాల: ఈ పిల్లల్ని గుర్తిస్తే.. ఫోన్ చేయండి!

కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు రక్షించిన ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం వీరు శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్నారు. నిందితుల సమాచారం ప్రకారం.. వీరిని కాజీపేట, మంచిర్యాల, రామగుండం రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో అపహరించినట్లు తెలిసింది. ఎవరైనా ఈ ముగ్గురు పిల్లలను గుర్తిస్తే వెంటనే కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి (87126 85122)ని సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
Similar News
News March 11, 2026
కరీంనగర్‌లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 11, 2026
సంగారెడ్డి: 12న మున్సిపల్ ప్రజాప్రతినిధులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు చెందిన నూతన ఛైర్మన్లు, కౌన్సిలర్లకు ఈనెల 12న శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టం-2019పై ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
News March 11, 2026
2027 జనగణన.. ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

AP: 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడుతున్నట్లు CM CBNకు సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియ 2 దశల్లో జరగనుండగా, తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన చేపట్టనున్నట్టు తెలిపారు. మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. APR 16-30 స్వీయ గణనకు అవకాశం కల్పిస్తారు. రెండో దశలో 2027 FEB నుంచి జనాభా లెక్కింపు ఉంటుంది.


