News February 12, 2025
మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవిజ ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.
Similar News
News October 26, 2025
రైతులను అప్రమత్తం చేయండి: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వరి పంటకు నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
News October 26, 2025
అనకాపల్లి జిల్లాలో మూడు రోజులు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 27 నుంచి 29 వరకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు డీఈఓ అప్పారావు నాయుడు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు తెరవకూడదన్నారు. ఏదైనా పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు.
News October 26, 2025
మేడ్చల్ జిల్లాలో రూ.325 కోట్ల ఎక్సైజ్ రాబడి

మేడ్చల్ జిల్లా పరిధిలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన రాబడి వివరాలను అధికారులు వెల్లడించారు. మల్కాజిగిరి ఎక్సైజ్ డివిజన్లో ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.152 కోట్లు, మేడ్చల్ ఎక్సైజ్ డివిజన్లో రూ.173 కోట్లు సమకూరినట్లుగా ఆ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మొత్తం కలిపి రూ.325 కోట్లు సమకూరాయి. ఆదాయాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా వివరించింది.


