News February 12, 2025

మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

image

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవిజ ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.

Similar News

News March 19, 2025

పోతురాజు కాలువ పనుల్లో అవినీతి: MLA దామచర్ల

image

ఒంగోలులో ఉన్న పోతురాజు కాలువ, నల్ల కాలువ సమస్యలపైన గతంలో పోతురాజు కాలువలో జరిగిన అవినీతిని, అసెంబ్లీలో MLA దామచర్ల జనార్దన్‌రావు ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. పోతురాజు కాలువ ఆధునీకరణలో అవినీతి జరిగిందని MLA సభ దృష్టికి దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై ఇరిగేషన్ శాఖ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకొని అవినీతి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

News March 19, 2025

భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్

image

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు.

News March 19, 2025

టేకుమట్ల: రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

image

టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన సొల్లేటి రాములు ప్రమాదవశాత్తు గతేడాది వాగులో పడి మృతి చెందాడు. కాగా పోస్ట్ ఆఫీసులో ప్రమాద బీమా చేయించుకున్న రాములు కుటుంబ సభ్యులకు మంగళవారం పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంతు, రామకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంపీడీవో అనిత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీశ్ చేతుల మీదుగా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. బీమాతో కుటుంబం ధీమాగా ఉంటుందన్నారు.

error: Content is protected !!