News April 16, 2025

మంచిర్యాల కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

image

ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న భూ భారతిపై నిర్వహించే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొంటారని జన్నారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. జన్నారం రైతు వేదికలో బుధవారం ఉదయం 10 గంటలకు భూ భారతిపై నిర్వహించే సదస్సులో కలెక్టర్ పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 6, 2025

పరకామణి చోరీ కేసు.. 30మందితో విచారణ

image

తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా, 10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్, సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.

News November 6, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసుల బదిలీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ఎస్పీ సతీశ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరంతా బదిలీ అయిన స్థానాల్లో 3 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News November 6, 2025

ఈనెల 27న సింగపూర్‌కు బెస్ట్ టీచర్లు: లోకేశ్

image

AP: 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27న సింగపూర్ పంపే ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు. ‘విద్యా విధానాలపై అధ్యయనానికి బెస్ట్ టీచర్లను సింగపూర్ పంపిస్తున్నాం. స్టూడెంట్ అసెంబ్లీకి ఏర్పాట్లు చేయాలి. డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీట్‌కు పెట్టాలి. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగం చేయాలి. రాష్ట్రంలో కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.