News April 16, 2025
మంచిర్యాల కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న భూ భారతిపై నిర్వహించే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొంటారని జన్నారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. జన్నారం రైతు వేదికలో బుధవారం ఉదయం 10 గంటలకు భూ భారతిపై నిర్వహించే సదస్సులో కలెక్టర్ పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News April 17, 2025
తడి, పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో ఈనెల 19న మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఈ మాసంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్(ఈ వేస్ట్ రీసైక్లింగ్) అంశంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. జిల్లా అంతట పరిశుభ్రత కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
News April 17, 2025
కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 17, 2025
పాడేరు: హాట్ బజార్స్ నిర్మాణాలపై సమీక్ష

హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు ఆదేశించారు. ఐటీడీఏలో జీసీసీ, వెలుగు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి మండలానికి ఒక మినీ సూపర్ బజార్ మంజూరు అయిందిని తెలిపారు.