News February 5, 2025
మంచిర్యాల కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌కు ఏర్పాట్లు

మంచిర్యాల మున్సిపాలిటీని ప్రభుత్వం కార్పొరేషన్‌గా మార్చినందున మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రోన్ సర్వే ప్రక్రియ పూర్తయిందని, బేసామ్యాప్ రూపొందించి సంబంధిత శాఖల ద్వారా వివరాలను సేకరించి పరిశీలిస్తామన్నారు.
Similar News
News December 6, 2025
పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.
News December 6, 2025
మహబూబాబాద్: మూడో విడతలో సర్పంచ్‌కు 1,185 నామినేషన్లు

మూడో విడత ఎన్నికల్లో డోర్నకల్, గంగారం కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్ మండలాల్లో 169 గ్రామ పంచాయతీల్లో 1,412 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 3వ రోజు నామినేషన్లు ముగిశాయి. సర్పంచ్‌కు 1,185, స్థానాలకు నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,592 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపసంహరణ, స్క్రూటీని అనంతరం ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.
News December 6, 2025
మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.


