News February 5, 2025

మంచిర్యాల కార్పొరేషన్‌ మాస్టర్ ప్లాన్‌కు ఏర్పాట్లు

image

మంచిర్యాల మున్సిపాలిటీని ప్రభుత్వం కార్పొరేషన్‌గా మార్చినందున మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రోన్ సర్వే ప్రక్రియ పూర్తయిందని, బేసామ్యాప్ రూపొందించి సంబంధిత శాఖల ద్వారా వివరాలను సేకరించి పరిశీలిస్తామన్నారు.

Similar News

News February 12, 2026

ఉప్పుతో పిల్లలకు ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!

image

చిన్న పిల్లల ఆహారంలో అదనంగా ఉప్పు చేర్చడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఏడాదిలోపు పిల్లల కిడ్నీలు సున్నితంగా ఉండటం వల్ల ఉప్పును తట్టుకోలేవు. తల్లి పాలతో పాటు సహజ ఆహారంలో ఉండే సోడియం వారికి సరిపోతుంది. చిన్నప్పుడే ఉప్పు అలవాటు చేస్తే పెద్దయ్యాక BP, గుండె సమస్యలు రావొచ్చు. చిరుతిళ్లకు బదులు పండ్లు, కూరగాయలు అలవాటు చేస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అని సూచిస్తున్నారు.

News February 12, 2026

నిర్మల్: బల్దియా పీఠం ఎవరికి ?

image

నిర్మల్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కనుందో శుక్రవారం తేలనుంది. ఛైర్‌పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో ఆసక్తి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పీఠం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఎవరికి వారు తమ పార్టీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మల్ బల్దియాపై ఏ పార్టీ ఆధిపత్యం చాటుతుందో వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News February 12, 2026

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలి: కలెక్టర్ చంద్రశేఖర్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు జి.రమేష్‌తో కలిసి ఆర్జాలబావిలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని తెలిపారు.