News December 11, 2024
మంచిర్యాల: కుటుంబంలో ముగ్గురు మృతి

కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు బుధవారం ఉదయం మృతి చెందారు. తాండూరు మండలం కాసిపేటకు చెందిన మొండయ్య కుటుంబీకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య, అతడి కుమార్తె చైతన్య(30) ఇవాళ ఉదయం మృతి చెందగా.. కొద్దిసేపటి క్రితమే అతడి భార్య శ్రీదేవి కూడా మృతి చెందింది. కుమారుడు శివప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News December 3, 2025
ADB: నేటి నుంచి 3వ విడత నామినేషన్ల స్వీకరణ

ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు, బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తం 151 పంచాయతీలు, 1,220 వార్డు సభ్యుల నామినేషన్ల కోసం 39 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
ఆదిలాబాద్: CM సభ.. పార్కింగ్ వివరాలు

ADB స్టేడియంలో రేపు జరిగే CM సభకు వచ్చేవారి కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
★టూ వీలర్ ప్రజలకు రామ్ లీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాల వద్ద పార్కింగ్ చేసుకోవాలి
★ఆటోలకు, కార్లకు డైట్ కళాశాల మైదానం
★వీఐపీలకు శ్రీ సరస్వతి శిశు మందిర్, టీటీడీ కళ్యాణమండపం
★నిర్మల్ నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు పిట్టలవాడ, మావల PS మీదుగా వెళ్లి తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ Jr కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలి
News December 2, 2025
ADB: విత్తన బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలి

ముసాయిదా విత్తన బిల్లు–2025 రూపకల్పనలో ప్రతి వర్గ అభిప్రాయం కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో రైతులు, విత్తన డీలర్లు, కంపెనీలు, రైతు ఉత్పాదక సంఘాలు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్న ప్రత్యేక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. కొత్త విత్తన బిల్లు రైతు ప్రయోజనాలను కాపాడేలా, నాణ్యమైన విత్తనాల సరఫరాపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.


