News December 11, 2024
మంచిర్యాల: కుటుంబంలో ముగ్గురు మృతి
కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు బుధవారం ఉదయం మృతి చెందారు. తాండూరు మండలం కాసిపేటకు చెందిన మొండయ్య కుటుంబీకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య, అతడి కుమార్తె చైతన్య(30) ఇవాళ ఉదయం మృతి చెందగా.. కొద్దిసేపటి క్రితమే అతడి భార్య శ్రీదేవి కూడా మృతి చెందింది. కుమారుడు శివప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News January 19, 2025
బాలుడిని రేప్ చేసి చంపేశాడు : నిర్మల్ ASP
నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో ఇటీవల జరిగిన <<15184983>>బాలుడి హత్య<<>> కేసును పోలీసులు ఛేధించారు. ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్‌కు హోమో సెక్స్ అలవాటు ఉంది. కామవాంఛ తీర్చుకోవడం కోసం శుక్రవారం అర్ధరాత్రి బాలుడిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని భయపడి మత్తులో బాలుడిని హత్య చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
News January 19, 2025
నిర్మల్: ఎడ్ల బండిని ఢీకొట్టిన బైక్.. బాలుడి మృతి
నిర్మల్ జిల్లాలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టడంతో కొడుకు మృతిచెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పెంబి మండలం సెట్‌పల్లి గ్రామానికి చెందిన పవర్ రాజు తన కొడుకు అఖిల్‌తో కలిసి బైక్‌పై రాత్రి పెంబి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా.. రాజు, అఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అఖిల్ మృతి చెందాడు.
News January 19, 2025
నిర్మల్: దైవ దర్శనానికి వెళ్తుండగా యాక్సిడెంట్
నిర్మల్ జిల్లాలో<<15191861>> రోడ్డు ప్రమాదం<<>> రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. MHలోని జబల్పూర్‌కు చెందిన సమిత(53), విజయ్(57), నితిన్, అనిత, సుదీర్ శ్రీశైలం దర్శనానికి కారులో వెళ్తున్నారు. మామడ మండలం బూర్గుపల్లి సమీపంలో హైవేపై అడ్డొచ్చిన కోతులను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో సమిత, విజయ్ స్పాట్‌లోనే చనిపోగా మిగతా ముగ్గురు గాయపడ్డారు. దర్శనానికి వెళ్తుండగా 2 కుటుంబాల్లో ఒక్కొక్కరు చనిపోవడం విషాదకరం.