News February 19, 2025
మంచిర్యాల: కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి గిరిరాజు సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ..నియోజకవర్గంలో పత్తి రైతులకు న్యాయం జరిగేలా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్ళు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు.
Similar News
News November 26, 2025
జాతీయ స్థాయిలో కర్నూలుకు పతకాలు

ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో జరిగిన 8వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల(క్యాడెట్ విభాగం-అండర్ 45)లో జిల్లా క్రీడాకారులు కార్తీక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శిక్షకుడు సతీశ్ తెలిపారు. మరో క్రీడాకారిణి గాయత్రి 41వ సీనియర్ అండర్-53 విభాగంలో రన్నర్‌గా నిలిచారన్నారు. వారిని మంగళవారం ఘనంగా సత్కరించారు.

పీస్ ప్లాన్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్స్కీతో భేటీ: ట్రంప్

రష్యా, ఉక్రెయిన్ మధ్య వీలైనంత త్వరగా శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు వారం రోజులుగా పీస్ ప్లాన్‌పై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. US ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్లాన్‌కు ఇరు దేశాలు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాయని, కొన్నింటికి అంగీకారం రావాల్సి ఉందన్నారు. ఈ డీల్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్స్కీతో సమావేశం అవుతానని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.