News February 19, 2025

మంచిర్యాల: కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి గిరిరాజు సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ..నియోజకవర్గంలో పత్తి రైతులకు న్యాయం జరిగేలా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్ళు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు.

Similar News

News November 11, 2025

ముకేశ్ అంబానీపై CBI విచారణకు పిటిషన్

image

$1.55B విలువైన ONGC గ్యాస్‌ను దొంగిలించారంటూ రిలయన్స్, ముకేశ్ అంబానీపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నమ్మకద్రోహం, అక్రమాలతో గ్యాస్‌ను థెఫ్ట్ చేశారని, CBIతో విచారణ చేయించాలని జితేంద్ర పి మారు అనే వ్యక్తి కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు CBI, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే భూమి బ్లాక్‌ల మధ్య గ్యాస్ కదలికలు సహజమని, దాన్ని వెలికితీసే అధికారం తమకు ఉందని RIL పేర్కొంటోంది.

News November 11, 2025

తూ.గో: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

తూ.గో జిల్లాలో 2026లో జరిగే SSC/OSSC/వొకేషనల్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు నోటిఫికేషన్ విడుదలైందని DEO కె.వాసుదేవరావు తెలిపారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన విద్యార్థుల ఫీజు చెల్లింపు షెడ్యూల్ HMలకు పంపామన్నారు. ఈనెల 13 నుంచి 25వ తేదీలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు కట్టవచ్చన్నారు. రూ.50 ఫైన్‌తో 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 11వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 15లోపు చెల్లించాలన్నారు.

News November 11, 2025

‘సిద్దిపేట జిల్లాకు అందెశ్రీ జిల్లాగా పేరు మార్చాలి’

image

సిద్దిపేట జిల్లా పేరును అందెశ్రీ సిద్దిపేట జిల్లాగా పేరు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.