News March 31, 2025

మంచిర్యాల: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. మంచిర్యాల జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.

Similar News

News February 23, 2026

అనకాపల్లి: ఈనెల 28న మంత్రి లోకేశ్ రాక

image

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతంపాలెం గ్రామంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వస్తున్నట్లు టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

News February 23, 2026

ASF: పోలీస్ ప్రజావాణిలో 8 దరఖాస్తులు

image

ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ASF జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.

News February 23, 2026

అంతర పంటలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.