News January 26, 2025
మంచిర్యాల: క్షుద్రపూజల పేరిట ఘరానా మోసం

మంచిర్యాల జిల్లాలో క్షుద్రపూజలు చేస్తే రూ.కోట్లలో డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రభంజన్ అనే వ్యక్తికి క్షుద్ర పూజలు చేస్తే రూ.కోట్లలో డబ్బులు వస్తాయని చెప్పి మోసగాళ్లు రూ.2 లక్షలు వసూలు చేశారు. ముఠాపై అనుమానం రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన నస్పూర్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
Similar News
News December 18, 2025
NZB: తుది దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం

నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తుది దశ పోరులో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో విడతలో మొత్తం 165 పంచాయతీ సర్పంచ్లకు 19 చోట్ల ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 95 చోట్ల, బీఆర్ఎస్ 36, బీజేపీ 16, స్వతంత్రులు 18 చోట్ల సర్పంచ్లుగా గెలుపొందారు.
News December 18, 2025
పసిపిల్లలు బాగా పడుకోవాలంటే?

పసిపిల్లలు బాగా నిద్రపోవాలంటే వారు రోజూ ఒకే సమయానికి పడుకొనేలా అలవాటు చేయాలి. కడుపు నిండా పాలు పట్టించాలి. పిల్లలు నిద్రపోయే ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. దోమలు, చీమలు లేకుండా చూడాలి. వాతావరణానికి తగ్గట్లు పక్క వేయాలి. తక్కువ వెలుతురు, శబ్దాలు ఉంటే సుఖంగా నిద్రపోతారు. పిల్లలతో చిన్నచిన్న ఆటలు ఆడించాలి. ఇది వారి కండరాలకు వ్యాయామంగా పనిచేసి, అలసిపోయేలా చేసి గాఢనిద్రకు దోహదం చేస్తాయి.
News December 18, 2025
ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ కన్నుమూత

భారత ప్రసిద్ధ శిల్పి, పద్మభూషణ్ రామ్ సుతార్(101) కన్నుమూశారు. నోయిడాలోని తన కుమారుడి నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(వల్లభాయ్ పటేల్)తో పాటు స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటీ(కెంపెగౌడ) శిల్పకర్త రామ్ సుతారే. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల ముందు కూర్చొని ఉండే గాంధీ విగ్రహం వంటి ఎన్నో ప్రసిద్ధ స్టాచ్యూలను ఆయనే రూపొందించారు.


