News January 30, 2025

మంచిర్యాల: గుండెపోటుతో ఎంపీడీవో మృతి

image

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల ఎంపీడీవో అలీం గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం హెల్త్‌చెకప్‌కు HYD వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన స్వస్థలం కాగజ్‌నగర్ మండలం కాగా ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. ఏడు నెలల్లో పదవీ విరమణ ఉండగా అంతలోనే విషాదం జరిగిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 11, 2025

నెల్లూరు జిల్లా హెడ్‌లైన్స్

image

✒ శంకరనగరంలో తల్లిని కాపాడబోయి.. కొడుకు మృతి
✒ బెడ్ కాఫీ బదులు బెడ్ లిక్కర్: కాకాణి
✒విడవలూరులో రోడ్డు విస్తరణ వద్దంటూ ఆందోళన
✒కందుకూరు MROతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం
✒అల్లూరు దర్గా సమాధిలో కదలికలు
✒కొండాపురంలో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి
✒నెల్లూరు ప్రజలరా.. ఆ లింక్ క్లిక్ చేశారో ఖాతా ఖాళీ

News February 11, 2025

నితీశ్ అలసిపోయారు.. మానసికంగా రిటైరైపోయారు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ CM నితీశ్ కుమార్‌పై జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తాజాగా విమర్శలు గుప్పించారు. ‘ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం జరగనుంది. ఎన్డీయే గెలిచినా సరే నితీశ్ మాత్రం ఇక బిహార్ సీఎంగా కొనసాగరు. ఆయన పరిస్థితి బాలేదు. శారీరకంగా అలసి, మానసికంగా రిటైరైపోయారు. కనీసం తన మంత్రుల పేర్లు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. బిహార్‌లో ఆయన ఇప్పుడు బీజేపీకి ఒక ముసుగు మాత్రమే’ అని పేర్కొన్నారు.

News February 11, 2025

బీచ్ ఫొటోలు ఎడిట్.. హీరోయిన్ ఆగ్రహం

image

ఒక నటిగా అందాన్ని ప్రదర్శించడంలో తాను జాగ్రత్తగా ఉంటానని మలయాళ నటి పార్వతీ R కృష్ణ చెప్పారు. అయితే ఇటీవల బీచ్ ఫొటో షూట్‌లో పాల్గొన్న దృశ్యాలను కొందరు యూట్యూబర్లు అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై ఇతరులు ఎందుకు స్పందించరో అర్థం కావట్లేదన్నారు. ఈమె ఏంజెల్స్, మాలిక్ తదితర చిత్రాల్లో నటించారు.

error: Content is protected !!