News April 8, 2025
మంచిర్యాల: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్

గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగింది. మందమర్రికి చెందిన హషాం అహ్మద్(45) సోమవారం రాయపట్నం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. అహ్మద్ కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. మృతుడి తండ్రి మహమ్మద్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News October 16, 2025
భద్రాచలం: విద్యార్థులకు రేపటి నుంచి క్రీడా పోటీలు

భద్రాద్రి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులను ఈ నెలలో జరిగే డివిజన స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేలా సంబంధిత హెచ్ఎం, వార్డెన్, పీడీ, పీఈటీలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని గురువారం ఐటీడీఏ పీవో బి.రాహుల్ గురువారం తెలిపారు. జిల్లాలోని 5 డివిజన్లలో ఈనెల 17,18 తేదీలలో క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
News October 16, 2025
వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు: నిర్మల్ కలెక్టర్

వర్షాకాలం నిర్మల్లో వరద నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి పట్టణంలో వరద నీటి నియంత్రణపై సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎక్కువగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నిల్వ ఉండకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని తెలిపారు.
News October 16, 2025
రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు: NPDCL సీఎండీ

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని NPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. హన్మకొండలోని NPDCL కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సర్వీసుల మంజూరుపై కమర్షియల్ విభాగం, 16 సర్కిళ్ల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.