News March 17, 2025
మంచిర్యాల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నస్పూర్లో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనతో పాటు మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు సోమవారం HYDలో డీజీపీ జితేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఘటనలకు కారకులపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.
Similar News
News December 8, 2025
పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.
News December 8, 2025
నాగర్కర్నూల్: 154 టీచర్, 974 ఆయా పోస్టులు ఖాళీలు

నాగర్ కర్నూల్ జిల్లాలో 154 అంగన్వాడీ టీచర్లు, 974 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఖాళీ పోస్టుల కారణంగా గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
News December 8, 2025
ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.


