News February 28, 2025

మంచిర్యాల: చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు

image

చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు తీసుకున్న మొత్తం నష్టపరిహారం ఇవ్వాలని రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కే.నిరోషా తీర్పునిచ్చారు. సీసీసీ నన్పూర్‌కు చెందిన వంటల సత్యనారాయణ రెడ్డి వద్ద మేకల సత్యనారాయణ రెడ్డి 2017లో రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో చెక్ బౌన్స్ అయింది. బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, నేరం రుజువుకావడంతో శిక్ష విధించారు.

Similar News

News November 23, 2025

HYD: ఇవాళ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

image

ఇవాళ మద్యాహ్నం ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. DEC 8 నుంచి 11వ తేది వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్- 2025ను నిర్వహిస్తోంది. పనుల ఏర్పాట్లను పలువురు మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేటలో 300 ఎకరాల విస్తీర్ణంలో సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దీనికి 3వేల మంది అతిథులు రానున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

News November 23, 2025

కృష్ణా: బెల్టు షాపులపై ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.!

image

గ్రామస్థాయిలో బెల్టు షాపు కనిపిస్తే ‘బెల్టుతీస్తా’ అన్న ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్ షాప్ నిర్వాహకులే నేరుగా మద్యం డోర్ డెలివరీ ప్రారంభించడంతో బెల్టు వ్యాపారం అడ్డదారులు వేస్తూ దూసుకుపోతోందని సమాచారం. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే మద్యం ఏరులై పారుతుంటే, ఆ శాఖ అధికారులు ఈ దందాలో భాగస్వాములా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News November 23, 2025

URDIPలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

image

CSIR-యూనిట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్(URDIP) 3ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. కెమికల్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో పీజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల వారు డిసెంబర్ 16న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://urdip.res.in/