News March 14, 2025

మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచిర్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ADBలో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News December 4, 2025

VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

image

విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.

News December 4, 2025

సిద్దిపేట: 17 సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

సిద్దిపేట జిల్లాలో తొలి విడత జీపీ ఎన్నికల్లో 17 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. గజ్వేల్ మండలంలోని రంగంపేట, ములుగు మండలంలోని జప్తిసింగాయపల్లి, వర్గల్(M) చాంద్ఖాన్ మక్త, తుంకిమక్తా, గుంటిపల్లి, జగదేవపూర్(M) పలుగుగడ్డ, నిర్మల్ నగర్, అనంతసాగర్, మాందాపూర్, BG వెంకటాపుర్, కొండాపూర్, దౌల్తాబాద్(M) లింగాయపల్లి, నర్సంపల్లి, రాయపోల్‌లోని ఆరెపల్లి, కొత్తపల్లి, మర్కుక్(M) ఎర్రవల్లి, నర్సన్నపేట జీపీలు ఏకగ్రీవమయ్యాయి.

News December 4, 2025

గద్వాల్: ఓ యువత ఏటువైపు మీ ఓటు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలో 11,600 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ సారి జరిగే సర్పంచ్ ఎలక్షన్లలో మొదటి ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్నారు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారా లేక మాటలు చెప్పి మబ్బి పెట్టే వారికి ఓటు వేస్తారా అనే సందేహం ఉంది. యువత మాత్రం అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువత తలచుకుంటే ఏదైనా చేస్తారని పలువురు ప్రజలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?