News May 25, 2024
మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య

ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అదే మండలంలోని సర్వాయి పేటకు చెందిన రాజేశ్(28), నాయిని చీకటి అనే వివాహిత కొంత కాలంగా కలిసి ఉంటున్నారు. శుక్రవారం ఇంటి యజమాని తలుపు తెరిచి చూడగా వారిద్దదూ ఉరేసుకొని చనిపోయి ఉన్నారు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రూరల్ CI సుధాకర్ ఈ ఘటన పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 17, 2025
ADB: వివాహిత అదృశ్యం.. 2 టౌన్‌లో కేసు నమోదు

ఆదిలాబాద్‌లోని ఖుర్షిద్ నగర్‌కు చెందిన 32 ఏళ్ల వివాహిత అదృశ్యమైనట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సెల్ ఫోన్ విషయంలో గొడవ జరగడంతో ఈ నెల 13న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. తిరిగి రాకపోవడంతో ఆమె భర్త ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.
News February 17, 2025
బోథ్: బీర్లు తాగబోమని ప్రతిజ్ఞ చేసిన యువకులు

బోథ్ మండలంలోని పలువురు యువకులు వినూత్న ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల ప్రభుత్వం బీర్ల రేట్లు పెంచడంతో అసహనం వ్యక్తం చేశారు. వేసవి వస్తుందంటే చాలు ప్రభుత్వాలు బీర్లపై రూ.30 నుంచి రూ.40 వరకు పెంచుతున్నాయని ఆరోపించారు. దానికి నిరసనగా విద్యార్థి యూత్ సభ్యులు ఇకముందు తాము బీర్లు తాగబోమని ప్రతిజ్ఞ చేశారు. కటకం శ్రీకాంత్ కరిపే శ్రీనివాస్, సబ్బని కిషోర్ శివ, సాయి తదితరులు ఉన్నారు.
News February 17, 2025
ఆదిలాబాద్: ఉరేసుకుని ఉపాధ్యాయుడి సూసైడ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మావలలో చోటుచేసుకుంది. SI విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వెంకటాపూర్‌కు చెందిన బానోత్ సంతోష్ (28) జైనూర్ మండలం జామిని గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆదిలాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.