News February 8, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*బెల్లంపల్లిలో బీరు సీసాలతో దాడి.. నలుగురిపై కేసు *బెల్లంపల్లి రేంజ్ లోనే పులి ఆవాసం *వింత బారిన పడుతున్న కుక్కలు*వేలాల గిరి ప్రదక్షిణకు ఆర్టీసి బస్సు సౌకర్యం *ఢిల్లీలో గెలుపు పట్ల జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు.

Similar News

News December 19, 2025

ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 21న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ తెలిపారు. ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

News December 19, 2025

ఇంట్లో వాళ్లతో పోటీ పడటం కష్టంగా ఉంది: లోకేశ్

image

AP: ఎన్నికల్లో పోటీ చేయడం కంటే తనకు ఇంట్లో వాళ్లతో పోటీ పడటం కష్టంగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘‘తండ్రి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. తల్లికి ‘గోల్డెన్ పీకాక్ అవార్డు’ వచ్చింది. భార్య ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజిజెస్’ అవార్డ్ గెలిచింది’’ అని ట్వీట్ చేశారు. తన కుమరుడు దేవాన్ష్ కూడా చెస్ ఛాంపియన్ అని పేర్కొన్నారు. ఈ పోటీ తరతరాలుగా కొనసాగుతూనే ఉందని చెప్పారు.

News December 19, 2025

నంద్యాల: ఫొటోల మార్ఫింగ్.. ఇద్దరు మహిళల అరెస్ట్

image

కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పరిధిలోని పోలీసు అధికారుల ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రమేశ్ బాబు తెలిపారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న వారి సమాచారం తెలియడంతో బందెల స్పందన, బందెల మారతమ్మను కోవెలకుంట్లలో అరెస్ట్ చేశామన్నారు. మార్ఫింగ్‌కు వాడుతున్న రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.