News February 16, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)గోపాల్‌నగర్ శివారులో పులి సంచారం2)జన్నారం: స్వగ్రామానికి చేరిన మల్లేశ్ మృతదేహం3)ADB: BRS నేత మనవడికి KCR పేరు4)నస్పూర్‌లో ఆయుత చండీయాగం5)లక్షెట్టిపేట: పేకాట రాయుళ్ల బైండోవర్6)మంచిర్యాల: జిల్లావ్యాప్తంగా సేవాలాల్ జయంతి వేడుకలు
Similar News
News December 4, 2025
సంక్రాంతి శోభలా మెగా పీటీఎం నిర్వహించాలి: అనకాపల్లి కలెక్టర్

మెగా పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్‌ను ఈనెల 5న సంక్రాంతి శోభలా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులందరూ సమావేశంలో పాల్గొనే విధంగా చూడాలని ఆమె సూచించారు. ఈ మేరకు విద్యాసంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభ, వారిలో ఉన్న సామర్ధ్యాలను ప్రదర్శించాలన్నారు.
News December 4, 2025
పెద్దపల్లి: పోస్ట్ బాక్సులు.. గుర్తున్నాయా..?

ఒకప్పుడు లేఖలతో పోస్ట్ బాక్సులు కళకళలాడేవి. ఆత్మీయుల శుభాకాంక్షలు, మనసులోని మాటలతో పలకరించేవి. అలాంటి మధుర జ్ఞాపకాలకు నెలవైన పోస్ట్ డబ్బాలు నేడు కనుమరుగయ్యాయి. ఫోన్లు, సోషల్ మీడియా రాకతో ఆ తపాలా పెట్టెలు ఆదరణ కోల్పోతున్నాయి. నేడు కేవలం ఖాళీ పెట్టెలు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. PDPL(D) ధర్మారంలో తీసిన చిత్రమిది. ఇక అప్పటి మధుర జ్ఞాపకాలను మోసిన పోస్ట్ బాక్సులతో మీకున్న అనుబంధాన్ని COMMENT చేయండి.
News December 4, 2025
కాగజ్‌నగర్‌లో మళ్లీ పులి భయం

కాగజ్‌నగర్ డివిజన్లో మళ్లీ పులి భయం మొదలైంది. నవంబర్ నెలలోనే నలుగురు పులి దాడిలో మరణించారు. పులులు నవంబర్, డిసెంబర్ నెలల్లో తమ ఆవాసం, తోడు కోసం సంచరిస్తుంటాయి. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం 10 కిలోమీటర్లకు పైగా తిరుగుతాయి. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెంచికల్పేట్ మండలంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.


