News February 18, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1)విద్యార్థుల ఆందోళనపై స్పందించిన చెన్నూర్ ఎమ్మెల్యే2)హాజీపూర్: పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు3)ఎల్లారం పరిసరాల్లో పెద్దపులి సంచారం4)మంచిర్యాల: రైలు కింద పడి మహిళ మృతి5) చెన్నూర్ మండలం అక్కేపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం

Similar News

News October 29, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు!

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 29, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని బాలికను 2019 ఏప్రిల్‌లో అత్యాచారం చేసిన కేసులో నేరం నిర్ధారణ కావడంతో కళ్యాణ్ అనే నిందితుడికి జడ్జి శంకర్రావు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు.

News October 29, 2025

ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లకు తుమ్మల ఫోన్

image

మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని, కీలక ఆదేశాలు జారీ చేశారు.