News February 18, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)విద్యార్థుల ఆందోళనపై స్పందించిన చెన్నూర్ ఎమ్మెల్యే2)హాజీపూర్: పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు3)ఎల్లారం పరిసరాల్లో పెద్దపులి సంచారం4)మంచిర్యాల: రైలు కింద పడి మహిళ మృతి5) చెన్నూర్ మండలం అక్కేపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం
Similar News
News April 17, 2026
నెల్లూరు: వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా తప్పనిసరి

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. ఈ సంతోషం సోఖానికి కారణం కాకుండా తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా ఎండ ఉపశమనం కోసం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు చెరువులు, నదులు, బావుల వద్దకు వెళుతుంటారు. ఆ సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
News April 17, 2026
శ్రీ సత్యసాయి: రెగ్యులేటర్ ఆపేసి ఉంటే నలుగురు బతికేవారు!

కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటనలో నిందితులు సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఉంటే నాలుగురి ప్రాణాలు నిలబడేవి. గ్యాస్ లీక్‌ను గమనించిన వెంకన్న ఇంట్లో వారిని తీసుకొని బయటికొచ్చేశాడు. పొగలు కమ్ముకొని ఒత్తిడికి జిలెటిన్ స్టిక్స్ పేలాయి. నిందితులు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారని, సహాయం చేయడానికి వెళ్లిన అమాయకుల ప్రాణాలు పోయాయని స్థానికులు అంటున్నారు. రెగ్యులేటర్ ఆపేసి ఉంటే నలుగురు బతికేవారని వాపోయారు.
News April 17, 2026
ఖమ్మం: పల్టీ కొట్టిన వరి కోత మిషన్.. డ్రైవర్ మృతి

కల్లూరు మండలం పెద్ద కోరుకొండి శివారులో వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


