News February 19, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

>కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ >బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం.మంత్రి శ్రీధర్ బాబు >రేపటి నుంచి కేయూ దూరవిద్య సెమిస్టర్ పరీక్షలు >MNCL:శివాజీ విగ్రహం లేకపోవడం శోచనీయం. రఘునాథ్>మంచిర్యాల: 33గొర్రెలు చోరీ.. నలుగురి అరెస్ట్ .
Similar News
News March 12, 2025
పుంగనూరు: రేపు శ్రీవారి కల్యాణోత్సవం

పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
News March 12, 2025
త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

దేశంలో త్వరలో హైడ్రోజన్తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.
News March 12, 2025
మెదక్: పనులు సక్రమంగా జరిగేలా చూడాలి: కలెక్టర్

రిజిస్ట్రేషన్, ధరణి ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. కౌడిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. భద్రపరిచిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స్, రిజిస్ట్రేషన్ గదులను పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, ధరణి పనితీరును పరిశీలించారు. సర్వర్ ఎలా పనిచేస్తుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.