News January 31, 2025
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పెద్దపులి సంచరిస్తున్న అడుగులు గుర్తించినట్లు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు. ధర్మారావుపేట అటవీ అటవీ సెక్షన్ పరిధిలోని బుగ్గగూడెం శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు అనుమాన వ్యక్తం చేశారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
Similar News
News March 14, 2025
ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.
News March 14, 2025
అమెరికన్ NRIs బీకేర్‌ఫుల్… లేదంటే!

అమెరికాలో NRIలు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మాస్ డీపోర్టేషన్ కోసం వార్‌టైమ్ ఏలియన్స్ చట్టాన్ని ట్రంప్ ప్రతిపాదిస్తుండటం, గ్రీన్‌కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కాదని VP JD వాన్స్ చెప్పడాన్ని వారు ఉదహరిస్తున్నారు. లీగల్‌గా అక్కడికి వెళ్లినా తొలి ప్రాధాన్యం వైట్స్‌కేనని అంటున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోకుంటే తరిమేస్తామన్న ట్రంప్ పాలకవర్గం మాటల్ని గుర్తుచేస్తున్నారు. COMMENT.
News March 14, 2025
మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీ

మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా పోలీసు బృందం విజయం సాధించింది. పోలీసులకు, జర్నలిస్టులకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పోలీసు బృందం మొదట బ్యాటింగ్ చేసి 69 రన్స్ చేసింది. 69 రన్స్‌కు గానూ జర్నలిస్టు బృందం 67 రన్లు తీసి రన్నర్‌గా నిలిచింది. రెండు రన్ల తేడాతో పోలీస్ టీం విజయం సాధించింది. కాగా మాన్ అఫ్ ది మ్యాచ్ విలేఖరి రాజశేఖర్‌కు దక్కింది.