News January 31, 2025

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పెద్దపులి సంచరిస్తున్న అడుగులు గుర్తించినట్లు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు. ధర్మారావుపేట అటవీ అటవీ సెక్షన్ పరిధిలోని బుగ్గగూడెం శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు అనుమాన వ్యక్తం చేశారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

Similar News

News November 25, 2025

అయోధ్యలో నేడు కాషాయ జెండా ఎగరవేయనున్న PM మోదీ

image

అయోధ్య రామాలయంలో PM మోదీ నేడు కాషాయ జెండాను ఎగరవేయనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా 10 ఫీట్ల హైట్, 20 ఫీట్ల లెంగ్త్ ఉన్న ట్రయాంగిల్ ఫ్లాగ్‌ను ఆవిష్కరిస్తారు. దీనిపై సూర్యుడు, కోవిదార చెట్టు చిత్రాలు, ఓం సింబల్ ఉంటాయి. రామ మందిరానికి 2020 AUG 5న భూమిపూజ, 2024 JAN 22న రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాగా నేడు ధ్వజారోహణ ఉత్సవం నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.

News November 25, 2025

హనుమాన్ చాలీసా భావం – 20

image

దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
ఎంత కష్టమైన పనులైనా హనుమంతుని అనుగ్రహం లభిస్తే అవి సులభంగా మారిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లు, అడ్డంకులు మనకు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ మన ఆత్మవిశ్వాసం, బలానికి ఆంజనేయుడిపై పెట్టుకున్న నమ్మకం తోడైతే.. ఎంతటి కష్టాలనైనా అధిగమించగలమని, పెద్ద ఇబ్బందులను దాటడం కష్టమేం కాదని ఈ హనుమాన్ చరణం వివరిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 25, 2025

తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

image

AP: తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్‌తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు.