News February 27, 2025
మంచిర్యాల జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మొత్తం 30,921 ఓట్లకు గాను 11,045 ఓట్లు పోలవగా 35.72 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అలాగే ఉపాధ్యాయుల ఓటర్లు మొత్తం 1664 ఓట్లకు గాను 944 ఓట్లు పోలవగా 56.73 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 21, 2025
నాగర్ కర్నూల్: పెట్రోల్ పోయించుకుంటున్నారా.. జర జాగ్రత్త..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులుగా నీరు రావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గుండాల గ్రామానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి తన బైక్‌లో పెట్రోల్ నింపుకున్న తర్వాత బైక్ ఆగిపోయిందన్నారు. మెకానిక్‌ను సంప్రదించిన తర్వాత బైక్‌లో నుంచి పెట్రోల్‌ను తొలగించగా, అది నీరుగా మారినట్లు గుర్తించామన్నారు. బంకును తనిఖీ చేసి నమూనాను ల్యాబ్‌కు పంపారని తెలిపారు.
News March 21, 2025
గద్వాల: ‘ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి’

గద్వాల జిల్లాలో ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించేందుకు స్థానిక పార్టీల ప్రతినిధులు అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ నమోదు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
News March 21, 2025
పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.