News March 28, 2025
మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు.!

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 9,198 మంది రెగ్యూలర్ విద్యార్థులకు గాను 9,175 మంది, గతంలో ఫెయిలైన 134 మంది విద్యార్థులకు గాను 118 మంది హాజరయ్యారు. మొత్తం 9,332 మందికి 9,293 విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.
Similar News
News April 23, 2025
ఇవాళే పోలింగ్

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల పోలింగ్ ఇవాళ జరగనుంది. ఉ.8 నుంచి సా.4 వరకు ఓటింగ్ కొనసాగనుంది. 81మంది కార్పొరేటర్లు, 31మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలో MIM నుంచి మీర్జా రియాజ్, BJP నుంచి గౌతంరావు పోటీలో ఉన్నారు. MIMకు 50, BJPకి 24, BRSకు 24, INCకి 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీకి దూరంగా ఉన్న INC, BRS ఓట్లు ఎవరికి వేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎల్లుండి కౌంటింగ్ జరుగుతుంది.
News April 23, 2025
పెనమలూరు: ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతి (20) హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు.
News April 23, 2025
పార్వతీపురం: ‘వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి’

రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) 9552300009కు “హాయ్” అనండి..హాయిగా సేవలు పొందండి అన్నారు. ప్రభుత్వ వాట్సాప్ నంబరు 9552300009ను మన మిత్ర పేరుతో సేవ్ చేసుకోవాలన్నారు.