News April 5, 2025

మంచిర్యాల జిల్లాలో బార్‌లకు దరఖాస్తులు 

image

మంచిర్యాల జిల్లాలో రెండు నూతన బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నంద గోపాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో కొత్త బార్ లైసెన్సుల మంజూరుకు ఆసక్తి ఉన్న వారు రూ.లక్ష రుసుముతో నెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 29న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో ఎంపిక జరుగుతుందన్నారు.

Similar News

News November 12, 2025

విశాఖలో ట్రాఫిక్ డైవర్షన్స్

image

విశాఖలో 14,15 తేదీల్లో జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య (CII Summit–2025) సదస్సు నేపథ్యంలో నగర ట్రాఫిక్‌ పోలీసులు డైవర్షన్‌లు అమలు చేస్తున్నారు. విశాఖ కంటి ఆసుపత్రి జంక్షన్‌ వద్ద నుంచి శివాజీ పాలెం మీదుగా హైవేకు మార్గం మారుస్తారు. సిరిపురం, టైకూన్‌, మాస్క్‌ జంక్షన్‌ల వద్ద సాధారణ వాహనాల రూట్లు మార్చారు. భారీ వాహనాలు ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.

News November 12, 2025

జూరాలకు 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం ఇన్‌ఫ్లో 10,000 క్యూసెక్కులు వస్తోంది. దీంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తికి 7,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 281 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 9,907 క్యూసెక్కులు నీరు విడుదల అవుతోంది. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ లిఫ్టులకు నీటి సరఫరాను నిలిపివేశారు.

News November 12, 2025

HNK: మూడో రోజు.. మూడు జిల్లాల యువత సత్తా చాటారు!

image

హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ మూడో రోజు మూడు జిల్లాల అభ్యర్థులతో ఉత్సాహంగా సాగింది. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎంపికైన 623 మంది అభ్యర్థులు రన్నింగ్‌, ఫిజికల్‌ ఫిట్నెస్‌ పరీక్షల్లో పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు ఎత్తు, బరువు, ఛాతీ ప్రమాణాలను పరీక్షించి, ఉత్తీర్ణులైన వారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించారు.