News April 5, 2025
మంచిర్యాల జిల్లాలో బార్‌లకు దరఖాస్తులు

మంచిర్యాల జిల్లాలో రెండు నూతన బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నంద గోపాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో కొత్త బార్ లైసెన్సుల మంజూరుకు ఆసక్తి ఉన్న వారు రూ.లక్ష రుసుముతో నెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 29న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో ఎంపిక జరుగుతుందన్నారు.
Similar News
News April 24, 2025
రేపు ఆకాశం ‘నవ్వుతుంది’

ఆనందానికి చిహ్నమైన స్మైలీ ఫేస్ రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 5.30 గంటలకు శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. శుక్రుడు, శని 2 కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లుగా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా తెలిపింది. మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది.
News April 24, 2025
పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

ఆక్రమిత కశ్మీర్‌లో 42 లాంచ్ ప్యాడ్‌లను పాక్ సిద్ధం చేసినట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. 130మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే నుంచి 60మంది ఉగ్రవాదులు, స్థానిక టెర్రరిస్టులు 17మంది కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.
News April 24, 2025
విశాఖ: కొద్దిరోజుల్లో పెళ్లి.. యువతి ఆత్మహత్య

మరికొద్ది రోజుల్లో వివాహం అనగా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో గురువారం జరిగింది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకల ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం KGHకు తరలించారు.