News December 4, 2024

మంచిర్యాల జిల్లాలో భూకంపం

image

మంచిర్యాల జిల్లాలోని పలు చోట్ల బుధవారం భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నస్పూర్, జైపూర్, చెన్నూర్ ప్రాంతాల్లో ఉదయం 7.25 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనలతో ఒక్కసారిగా ఆందోళనలు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదు.

Similar News

News March 13, 2026

14న ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం : ADB కలెక్టర్

image

జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఆదిలాబాద్: ఉచితంగా వెజిటబుల్ కిట్ల పంపిణీ

image

వెజిటబుల్ మినీ కిట్లను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఉద్యాన శాఖ ద్వారా రైతులకు ఉచితంగా అందిస్తున్న కిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించడానికే ఉచిత కిట్లను అందిస్తున్నామన్నారు.