News March 20, 2025
మంచిర్యాల జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

మంచిర్యాల జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. వచ్చే నాలుగు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు ఉపశమనం పొందనున్నారు. కానీ పంటలకు నష్టం జరిగే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 18, 2025
అధ్యక్ష పదవికి కాలవ ససేమిరా!

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సుముఖంగా లేరట. అధ్యక్షుల జాబితాలో తన పేరును చూసి అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కాలవ రాయదుర్గంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఆయనను ఒప్పిస్తుందా లేదా ప్రత్యామ్నాయం చూస్తుందో వేచి చూడాలి.
News December 18, 2025
గర్భంతో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

గర్భధారణ సమయంలో ఒకే పొజిషన్‌లో ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. బరువైన వస్తువులను ఎత్తడం, అధిక పని చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం, ధూమపానం చేయకూడదు. కెఫీన్ తగ్గించాలి. పచ్చి ఆహారాలను తినకూడదని సూచిస్తున్నారు. సమయానికి తగ్గట్లు స్కానింగ్‌లు చేయించుకోవాలి.
News December 18, 2025
గురువారం రోజు చేయకూడని పనులివే..

గురువారం బృహస్పతి గ్రహంతో అనుసంధానమై ఉంటుంది. వాస్తు ప్రకారం ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదని నమ్ముతారు. నలుపు రంగు వస్తువులు, బూట్లు, నూనె, ఇనుము/స్టీల్ వస్తువులు కొనడం అశుభమని పండితులు చెబుతున్నారు. అలాగే ఆస్తి లావాదేవీలు చేపడితే ప్రతికూల ప్రభావాలు కలగొచ్చంటున్నారు. నేడు జుట్టు, గోళ్లను కత్తిరించకూడదట. అయితే శత్రువుల బెడద తగ్గడానికి మట్టి కుండ కొనాలని సూచిస్తున్నారు.


