News March 9, 2025

మంచిర్యాల జిల్లాలో శనివారం 6,200 కేసులు పరిష్కారం

image

మంచిర్యాల జిల్లా న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గంగా లోక్ అదాలత్ ద్వారా కోర్టు కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 6,200 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1.20 లక్షలు, బ్యాంకు కేసుల్లో రూ.28 లక్షలు రికవరీ అయ్యాయని వివరించారు.

Similar News

News March 10, 2025

విశాఖలో క్రికెట్ బెట్టింగ్.. బుకీ అరెస్ట్: సీపీ

image

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతుంటాడని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం తెలిసిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

News March 10, 2025

సంగారెడ్డి: నేటి నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్

image

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 10 నుంచి ఇంటర్మీడియట్ వాల్యూయేషన్ చేయనున్నట్లు జిల్లా అధికారి గోవిందారం తెలిపారు. 10న సంస్కృతం, 22న ఫిజిక్స్, 24న ఎకనామిక్స్, 26న కెమిస్ట్రీ, కామర్స్, 28న చరిత్ర, బాటని, జువాలజీ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

News March 10, 2025

NZB: విద్యార్థిని చితికబాదిన హాస్టల్ వార్డెన్

image

NZBలోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వాహజుద్దీన్‌ను చదవకుండా నిద్రపోతున్నాడని ఆదివారం హాస్టల్ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ నిఖిల్ కొట్టడంతో గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే అక్కడికి చేరి ప్రిన్సిపల్ హనుమంతరావును అడగగా హాస్టల్లో ఎలాంటి ఘటన జరగలేదన్నారు. తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం

error: Content is protected !!