News March 5, 2025
మంచిర్యాల జిల్లాలో 23 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,540 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News March 19, 2025
కామారెడ్డి: అంకిత భావంతో పనిచేసి మన్ననలు పొందాలి: జిల్లా కలెక్టర్

అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు.
News March 19, 2025
వేగవంతంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 41,412 దరఖాస్తులు రాగా.. 14,899 క్రమబద్దీకరణకు మంజూరు చేశారు. ఫీజు చెల్లించిన 665 మందికి క్రమబద్ధీకరణ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.
News March 19, 2025
లోకేశ్వరం: ‘ఫోన్ ఆర్డర్ పెడితే.. రూ.100 స్పీకర్ వచ్చింది’

రూ.వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్ పెడితే రూ.100 విలువచేసే డమ్మీ స్పీకర్ రావడంతో కొనుగోలుదారుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లోకేశ్వరం మండలం పుస్పూర్ తండాకి చెందిన వెంకట్ జీవన్ శ్రీ ఆరోగ్య బెంగళూర్ అనే సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లో శాంసంగ్ 5G రూ.16 వేల ఫోన్ కేవలం రూ.3,500కు వస్తుందని చూసి పేమెంట్ చేశాడు. ఆర్డర్ వచ్చాక వేచి చూస్తే రూ.100 విలువ చేసే సౌండ్ బాక్స్ వచ్చిందని వాపోయాడు.