News March 31, 2025
మంచిర్యాల జిల్లా అధికారిపై చీటింగ్ కేసు

జిల్లా ఉపాధి కల్పనాధికారి రవి కృష్ణపై చీటింగ్ కేసు నమోదయింది. 4/2024లో మందమర్రికి చెందిన RTI కార్యకర్త రాజేందర్ గౌడ్ ఔట్ సోర్సింగ్ వివరాలు కావాలని RTIచట్టం ద్వారా దరఖాస్తు చేశారు. 5/2024లో రూ.25,085 చెల్లిస్తే సమాచారం ఇస్తానని సదరు చెప్పడంతో DDద్వారా నగదు చెల్లించారు. కాగా అధికారుల నుంచి సమాదానం రాకపోడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో అధికారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు సూచించింది.
Similar News
News December 1, 2025
చందుర్తి : ఎంపీడీవో కార్యాలయాలు, చెక్‌పోస్టుల తనిఖీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్ సోమవారం పలు ఎంపీడీవో కార్యాలయాలు, ఎస్.ఎస్.టి. (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు. ఆయన రుద్రంగి ఎంపీడీవో కార్యాలయం, చెక్‌పోస్టులను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చందుర్తి, వేములవాడ అర్బన్, రూరల్ ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించి, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.
News December 1, 2025
SRCL: ‘నిబంధనలకనుగుణంగా విధులు నిర్వహించాలి’

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓ)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఎన్నికల, ఓట్ల లెక్కింపు వివిధ అంశాలపై సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సాధారణ వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ తో కలిసి శిక్షణ ఇచ్చారు.
News December 1, 2025
JGTL: T-హబ్‌లో డ్రైవర్లకు అందని బిల్లులు

జగిత్యాల T–హబ్‌లో పనిచేసే డ్రైవర్లకు 8 నెలలుగా బిల్లులు అందటం లేదు. అధికారులను అడిగిన ప్రతిసారి దాటేస్తున్నారని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5 రూట్లలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 1000-1500 వరకు శాంపిల్స్ సేకరించి T–హబ్ కు చేరుస్తారు. సోమవారం నుంచి డ్రైవర్లు విధులను నిలిపి వేయడంతో శాంపిల్స్ సేకరణ నిలిచిపోయాయి. ఇప్పటికైనా సమస్యపై ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.


