News April 24, 2024
మంచిర్యాల: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

మంచిర్యాలలోని ఎన్టీఆర్నగర్కు చెందిన పగరపు బిక్షపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతిచెందాడు. కూలీ పనిచేసుకుంటూ అతడు జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి సమీపంలోని డ్రైనేజీ మోరీపై కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
Similar News
News December 1, 2025
బాధితుల సమస్యలను పరిష్కరించాలి: ADB SP

ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యత అధికంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 28 ఫిర్యాదులు అందగా వాటిని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్కు తెలియజేయలన్నారు. ఆయనతో పాటు సీసీ కొండరాజు ఉన్నారు.
News December 1, 2025
ADB: విదేశి విద్య కోసం ఫ్రీ కోచింగ్

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కీలకమైన IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ డిబిసిడబ్ల్యూఓ రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 21లోపు www.tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 1, 2025
ADB: రామన్న.. సర్పంచ్ నుంచి మంత్రి వరకు

సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదగాలంటే రాజకీయాల్లో ఎంతో నిలదొక్కుకోవాలి. అలాంటి అవకాశమే మాజీ మంత్రి జోగు రామన్నను వరించింది. జోగు రామన్న జైనథ్ మండలంలోని దీపాయిగూడకు సర్పంచ్గా, ఎంపీటీసీ, జడ్పీటీసీగా సేవలందించారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన స్వరాష్ట్ర సాధనలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. అనంతం జరిగిన మూడు ఎన్నికల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం KCR క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.


