News January 24, 2025
మంచిర్యాల: తండ్రిని హతమార్చిన తనయుడు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని కొడుకు కడతేర్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆవిడపు రాజన్నను కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి దాటాక కొడుకు సాయిసిద్ధార్థ్ దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.
News November 21, 2025
వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్ ఆదాయం

వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీకమాసం సందర్భంగా రికార్డ్ స్థాయి ఆదాయం సమకూరింది. అక్టోబర్ 22 నుంచి నవండర్ 20 వరకు ఆర్జిత సేవలు, ఇతర టికెట్ల ద్వారా రూ.4,00,06,720, హుండీల లెక్కింపు ద్వారా రూ.4,22,60,841 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆదాయం 8 కోట్ల 22 లక్షల 67 వేల 561 రూపాయల లభించినట్లు వివరించారు.


