News March 16, 2025

మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారీ ఇచ్చిన కొడుకు

image

తండ్రిపై దాడి చేయించేందుకు సుపారీ ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్‌కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.

Similar News

News October 31, 2025

ఆదిలాబాద్‌లో క్రీడాకారుల ఎంపిక పోటీలు

image

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో U-17 జోనల్ లెవల్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. నవంబర్ 3న బాలబాలికల రగ్బీ, 4న బాలుర కబడ్డీ, 5న బాలికల క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులు సంబంధిత పోటీల్లో పాల్గొనేందుకు ఆరోజు ఉదయం 10 గంటలలోపు హాజరుకావాలని పోటీల కన్వీనర్లు తెలిపారు.

News October 31, 2025

కరీంనగర్ జిల్లాకు నేడు CM..!

image

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఏరియల్ సర్వే చేసిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News October 31, 2025

NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

image

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.