News March 26, 2025
మంచిర్యాల: నేటి పరీక్షకు 31 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో జరిగిన గణిత శాస్త్రం పరీక్షకు 9,198 మంది విద్యార్థులకు గాను 9,178 విద్యార్థులు, గతంలో ఫెయిలైన 90 మంది విద్యార్థులకు గాను 79 మంది హాజరయ్యారు. మొత్తం 9,288 మందికి 9,257 విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.
Similar News
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.
News October 20, 2025
విజయనగరం: పలు గ్రామాలకు రాకపోకలు బంద్

మెంటాడ మండలంలోని ఆండ్ర జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో చంపావతి నది పొంగిపొర్లుతుంది. దీంతో జగన్నాథపురం, చాకివలస, ఆగూరు, మల్లేడివలస, గూడెం, సారాడవలస, గజపతినగరం మండలంలోని మర్రివలసకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయినట్లే. ఎవరికైనా ప్రాణాపాయమైతే రిస్క్ చేసి నది దాటడం, లేదా కిలోమీటర్ల దూరం పంటపొలాల్లో డోలీద్వారా రోగిని అష్టకష్టాలు పడి తరలించాలి.
News October 20, 2025
బాపట్ల: సిద్ధమవుతున్న ఆలయాలు

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభం కానుంది. చాలామంది శైవక్షేత్రాలను దర్శించి దీపారాధన చేస్తుంటారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని శైవ క్షేత్రాలు సిద్ధమయ్యాయి. మల్లికార్జున స్వామి వారి దేవాలయం (మణికేశ్వరం), నగరేశ్వర స్వామి దేవాలయం (అద్దంకి), భవన నారాయణస్వామి దేవాలయం (బాపట్ల), జిల్లాలోని అన్ని శివాలయాల ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.