News February 28, 2025
మంచిర్యాల: నేడు, రేపు తాగునీటికి సరఫరాలో అంతరాయం

జిల్లాలో మిషన్ భగీరథ శుద్ధి కేంద్రానికి మరమ్మతులు చేయనుడడంతో శుక్రవారం, శనివారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఈడీ మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట్, హాజీపూర్, మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటిపల్లి మండలాలకు, మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్ పురపాలక సంఘాలకు రెండు రోజుల తాగునీరు నిలిపి వేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
HYD: ప్రజాభవన్‌లో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఈరోజు నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపేలా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.

ఎంజీయూ డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల కొత్త తేదీలు విడుదల

MGU పరిధిలో వాయిదా పడిన డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల (రెగ్యులర్/బ్యాక్లాగ్) రివైజ్డ్ టైమ్ టేబుల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.ఉపేందర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. గ్రూప్ ‘ఏ’ కాలేజీలు డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో, గ్రూప్ ‘బి’ కాలేజీలు డిసెంబర్ 5, 6, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అదే షెడ్యూల్లో ఎస్ఈసీ (SEC) & జీఈ (GE) పరీక్షలు నిర్వహించాలని సూచించారు.