News March 29, 2025
మంచిర్యాల: పదవి విరమణ పొందిన పోలీసులకు సన్మానం.!

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను CP అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించారు. CP మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ సహజం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి భవిష్యత్ తరం పోలీసులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఆనందోత్సవాలతో గడపాలన్నారు.
Similar News
News January 10, 2026
VZM: సంక్రాంతి సందడి.. కిక్కిరిసిన బస్సులు

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూలి పనుల నిమిత్తం వెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా VZM – VSKP రూట్లో రద్దీ ఎక్కువగా ఉంది. పండగ సందర్భంగా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
News January 10, 2026
క్యాల్షియం ఎక్కువగా ఎందులో దొరుకుతుందంటే?

కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. అలాగే ఆరెంజ్, ఆప్రికాట్, అంజీర పండ్లు, కివీ, స్ట్రాబెర్రీ, అరటిపండ్లలో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇవి ఎముకలు,దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయంటున్నారు నిపుణులు.
News January 10, 2026
మేడారం జాతరకు విస్తృత వైద్య ఏర్పాట్లు: మంత్రి దామోదర

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జాతర ప్రాంతంలో 50 పడకల ప్రధాన హాస్పిటల్‌తో పాటు 2 మినీ హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే 8 ప్రధాన రూట్లలో 42 ఎన్‌రూట్ క్యాంపులు, 35 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 3,199 మంది వైద్య సిబ్బంది 24 గంటలు సేవలందిస్తారని అన్నారు.


