News February 25, 2026
మంచిర్యాల: పదో తరగతికి 48 పరీక్షా కేంద్రాలు

మంచిర్యాల జిల్లాలో 48 పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో డీఈఓ యాదయ్య, ఇతర విద్యాశాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 9,703 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
అసైన్డ్ భూముల సమస్యకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో కలిసి అసైన్డ్ భూముల అంశంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ అంకిత్ నిర్వహించారు. భద్రాద్రి జిల్లాలో అసైన్డ్ భూములకు సంబంధించిన వివిధ సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అసైన్డ్ భూములపై అక్రమ ఆక్రమణలను కఠినంగా అరికట్టాలని, ఎక్కడైనా అక్రమాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 17, 2026
మహానందిలో యాక్సిడెంట్..ఒకరు మృతి

మహానంది సిరివెళ్ల మండల సరిహద్దులోని నంద్యాల గిద్దలూరు రహదారిలో గురువారం యాక్సిడెంట్ జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News April 17, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
వ్యవసాయం రైతులకు జీవనాడి: జడ్పీ సీఈఓ
శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి చేరుకున్న నరసన్నపేట పంచాయతీ రగడ
జనగణన ప్రక్రియను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
పాలీసెట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు


