News March 28, 2025
మంచిర్యాల: పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ

నస్పూర్‌లోని సింగరేణి కాలరీస్ హైస్కూల్లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు.
Similar News
News December 24, 2025
ఖమ్మం: తల్లి అనారోగ్యం తట్టుకోలేక కూతురు ఆత్మహత్య

కన్నతండ్రి మరణం, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడాన్ని తట్టుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం కవిరాజు నగర్‌కు చెందిన బట్ల సృజన తండ్రి 7ఏళ్ల క్రితం మృతి చెందగా, తల్లి మేరీ పద్మ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన సృజన.. బుధవారం ఇంట్లో ఉరివేసుకుంది. మరణానికి ముందు చిన్నప్పుడు తల్లితో దిగిన ఫొటోపై ‘క్షమించు అమ్మా.. నీకంటే ముందే వెళ్తున్నా’ అని రాసింది.
News December 24, 2025
క్రిస్మస్కు స్టార్ ఎందుకు పెడతారంటే?

క్రిస్మస్కు ఇంటికి/క్రిస్మస్ ట్రీపై స్టార్ పెడుతుంటారు. ఇది అలంకారం కోసం కాదు. బైబిల్ ప్రకారం యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం కనిపించింది. అది ఆయన జన్మించిన ప్రాంతాన్ని సూచిస్తుందని నమ్ముతారు. ముగ్గురు జ్ఞానులకు అది మార్గదర్శకంగా నిలిచిందని చెబుతారు. వారు నక్షత్రాన్ని అనుసరించి యేసు జన్మించిన ప్రాంతానికి చేరుకున్నారు. అలా ఇంటికి దైవ ఆశీస్సులు రావాలని కోరుకుంటూ స్టార్‌ను పెడతారు.
News December 24, 2025
జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలిజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. ఏసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడని, గొప్ప శాంతి దూత అని కొనియాడారు.


