News October 7, 2024
మంచిర్యాల: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం.. మంచిర్యాల నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, గొల్లపల్లి గ్రామానికి చెందిన రేచవేని రాజశేఖర్ 2ఏళ్లుగా ప్రేమించుకున్నారు. తనను శారీరకంగా లోబరుచుకొని, పెళ్లి మాట ఎత్తే సరికి ముఖం చాటేశాడని యువతి తెలిపింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పేర్కొంది.
Similar News
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.
News November 6, 2025
జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ADB వాసి

మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా వాసికి ఆహ్వానం అందింది. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి గిరిజన భాషా పరిరక్షకులు, మేధావులు, రచయితల సదస్సులో పాల్గొనాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్కు ఆహ్వానం లభించింది. జాతీయ స్థాయి సదస్సుకు ఆహ్వానించడం ఎంతో గర్వకారణం అని కైలాస్ అన్నారు.
News November 6, 2025
ప్రతి గర్భిణీ, బాలింతలకు పరీక్షలు చేయాలి: ADB కలెక్టర్

ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సమయానికి చికిత్స అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ రాజర్షి షా ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ, బాలింతలను గుర్తించి సమయానికి వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. సరైన పోషకాహారం అందించడంలో సిబ్బంది చురుకుగా వ్యవహరించాలన్నారు.


