News September 15, 2024

మంచిర్యాల: బంగారు నగల బ్యాగును అప్పగించిన పోలీసులు

image

బస్సులో పోగొట్టుకున్న బంగారు నగలతో కూడిన బ్యాగును కనుక్కొని బాధితురాలికి మంచిర్యాల పోలీసులు అందజేశారు. సీఐ బన్సీలాల్ వివరాలు.. జగిత్యాల నుంచి ఇందారంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి మంచిర్యాలకు వచ్చిన సానియా అనే మహిళ బస్సు దిగే సమయంలో బ్యాగ్ మర్చిపోయింది. దీంతో పోలీసులను సంప్రదించగా వెంటనే బ్లూ కోల్డ్ సిబ్బంది సీసీ కెమెరాలను పరీక్షించి రైల్వే స్టేషన్‌లో బ్యాగును గుర్తించి బాధితురాలికి అందజేశారు.

Similar News

News October 7, 2024

బోథ్: ‘సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు’

image

బోథ్ PHCలో గత మార్చి నెలలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న ఆదివాసి మహిళ డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 31న మహిళ అనారోగ్యంతో మరణించిందని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ద్వారా పోస్టుమార్టం నివేదికలో తేలిందని జిల్లా DSP జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సాధారణ మరణంపై ప్రస్తుతం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News October 7, 2024

ఆదిలాబాద్: ఆరో విడత ద్వారా ITIలో అడ్మిషన్లు

image

ఆరో విడత ద్వారా ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ITI కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 9 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు, తిరిగి నమోదు చేయనవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా నమోదు చేయని అభ్యర్థులు ఐటీఐ పోర్టల్‌లో కొత్తగా నమోదు చేసుకుని, కళాశాలకు హాజరు కావాలని సూచించారు.

News October 6, 2024

ఖానాపూర్‌: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

ఖానాపూర్‌ పట్టణంలోని సుభాష్‌నగర్‌ కాలనీలో గల వాగ్దేవి కళాశాల సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై రాహుల్‌ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.